జ్యోతి తన తండ్రి కోసం వారం పాటు 1,200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అమ్మాయి గుర్తుందా? ఆ 15 ఏళ్ల అమ్మాయి తన పేరుతో కంటే.. తండ్రి కోసం సైకిల్ తొక్కిన అమ్మాయిగానే చిరపరిచితం. ఆ అమ్మాయి ఇంట్లో విషాదం నెలకొంది. తండ్రి అంటే ఎంతో ప్రేమ చూపించే ఆ అమ్మాయి.. ఆ ప్రేమనే పోగొట్టుకుంది. గుండెపోటుతో ఆమె తండ్రి మరణించాడు. దీంతో ఆమె బాధ వర్ణనాతీతంగా మారింది. ఎన్నో బాధలు పడి, రెండు రోజులు తిండికి తిప్పలు పడి సొంతింటికి చేరినా.. తన తండ్రిని పోగొట్టుకుని ఇప్పుడు మరిన్ని బాధలు పడుతోంది.