ముంబై: ముంబై లోని ఘాట్ కోపర్ లో రెండు నాలుగు అంతస్థుల రెసిడెన్షియల్ భవనాలు కూలి పోయాయి. ఘాట్ కోపర్ వెస్ట్ లోని శ్రేయాస్ సినిమా హాల్ దగ్గర్లోని ఎల్బీఎస్ రోడ్ లో ఈ ఘటన జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ ఇప్పటి వరకు శిథిలాల కింద చిక్కుకున్న 9 మందిని రక్షించారు. మరో 30 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని వెలికి తీయడానికి రెస్క్యూ టీమ్ శతవిధాలా ప్రయత్నిస్తున్నది.