న్యూఢిల్లీ: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) mAadhaar పేరుతో ఓ కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా ఆధార్‌ను ఇక మీరు మొబైల్లోనూ తీసుకెళ్లొచ్చు. ఆండ్రాయిడ్ 5.0, ఆపై వెర్షన్ మొబైల్స్ అన్నింటిలోనూ ఈ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆధార్‌ను తీసుకెళ్లడంతోపాటు ఈ యాప్‌తో ఆధార్‌కు లింకైన తమ బయోమెట్రిక్ డేటాను కూడా యూజర్లు లాక్ లేదా అన్‌లాక్ చేసుకునే వీలుంటుంది. ఇందులో ఉండే క్విక్ రెస్పాన్స్ కోడ్ ద్వారా ఈకైవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్)ను షేర్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఆధార్‌తో లింకున్న మొబైల్ నంబర్ ఉంటేనే ఈ యాప్‌ను వాడుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ బీటా వెర్షన్లో ఉందని, అంటే యూజర్లకు అప్పుడప్పుడూ కొన్ని సమస్యలు వస్తుంటాయని యూఐడీఏఐ తెలిపింది.