ఓ బార్‌కు వెళ్లిన వ్యక్తి.. ఓ జంట పబ్లిక్‌గా రొమాన్స్ చేసుకోవడం చూసి ఆశ్చర్యపోయాడు. అలా చేయొద్దని చెప్పడానిప్రయత్నించాడు. ఈ సందర్భంగా ఆ యువతిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే.. ఆమె అతడి బెస్ట్ ఫ్రెండ్‌కు కాబోయే భార్య. మరికొద్ది రోజుల్లోనే పెళ్లి కూడా. నా ఫ్రెండ్‌నే చీట్ చేస్తావా అంటూ ఆ వ్యక్తి తన ఫోన్ తీసి వారి రొమాన్స్‌ను వీడియో తీశాడు. ఈ సందర్భంగా ఆమెతో ఉన్న యువకుడు మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్‌చేసి తన ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ వీడియో తర్వాత ఏం జరిగిందనేది మీరు ఊహించుకోవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఆమెతో ఉన్న వ్యక్తి బార్టెండర్ అని.. తాత్కాలిక సుఖం కోసం ఆమె వెంపర్లాడి పెళ్లి చెడగొట్టుకుందని తెలిసింది. పెళ్లికి ముందే ఇది బయటపడటంతో ఆ పెళ్లి కొడుకు బతికిపోయాడని నెటిజనులు అంటున్నారు. అయితే, కొందరు మాత్రం ఆ వధువుకు సపోర్టు చేస్తున్నారు. ఇదే పని వరుడు చేస్తే ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.