లీగల్ ఓట్లు లెక్కిస్తే తనదే విజయం అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రక టించారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే తనదే విజయం అని ట్రం ప్ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. తొలిసారి ఆయన నిన్న మీడియా ముందుకు వచ్చారు. తనని రెండో సారి అధికారంలోకి రానివ్వకుండా పెద్ద కుట్రే జరుగుతోందని ఆరోపించారు. మీడియా, ఎన్నికల అధికారులు డెమొక్రా ట్లతో కుమ్మకయ్యారని విమర్శించారు. పెద్ద పెద్ద సాంకేతిక, మీడియా సంస్థలు జోక్యం చేసుకున్నప్పటికీ.. నిర్ణయాత్మక రాష్ట్రాల్లో తానే విజయం సాధించానని, డెమొక్రాట్ల హవా నడుస్తోందన్నారు. కానీ ఎక్కడా అది కనిపించలేదన్నారు. మొత్తం రిపబ్లికన్ల గాలే వీచిందని, సెనేట్లో పట్టు నిలుపుకున్నామని, ఎక్కువ మంది మహిళలు ఎన్నికయ్యారని తెలిపారు.