ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబర్ లో బ్యాంకు సెలవులు ఇవే..ముందే ప్లాన్ చేసుకోండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 31, 2020, 04:21 PM

సెప్టెంబర్ లో బ్యాంకు లావా దేవీలు నిర్వహించాలనుకుంటున్నారా..? అయితే ఈ తేదీలలో బ్యాంకు సెలవు ప్రకటించాయి. అవి పబ్లిక్ హాలీడేస్. కాబట్టి ఆ సెలవులు తెలుసుకుని మీ బ్యాంకు లావా దేవీలు, ట్రాన్సెక్షన్స్ ప్లాన్ చేసుకోవడం మంచింది. గత ఆగష్టులో 10 రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. అయితే సెప్టెంబర్ లో మాత్రం ఆరు రోజులు బ్యాంకు హాలీడేస్ వచ్చాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లో మీకు ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు ఉంటే ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో తెలుసుకొని మీ ట్రాన్సాక్షన్స్ ప్లాన్ చేసుకోవడం మంచిది. లేకపోతే లావాదేవీల్లో జాప్యం జరగొచ్చు.
సెప్టెంబర్‌లో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు 6 రోజులు పనిచేయవు. ఇవన్నీ పబ్లిక్ హాలిడేసే కావడం గమనార్హం. సెలవుల విషయానికి వస్తే సెప్టెంబర్ 12న రెండో శనివారం, 26న నాలుగో శనివారం బ్యాంకులకు సెలవులు. ఇకపోతే సెప్టెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో ఆదివారం రావడంతో ఆ తేదీలలో సెలవు. ఈ నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులే. మరోవైపు రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఇతర సెలవులేమీ లేవు. ఇక సెప్టెంబర్ 2న తిరువనంతపురం, కొచ్చి, గ్యాంగ్‌టక్, సెప్టెంబర్ 17న అగర్తలా, బెంగళూరు, కోల్‌కతా, సెప్టెంబర్ 21న కొచ్చి, తిరువనంతపురంలో స్థానిక పండుగల కారణంగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com