ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో డిజిటల్ పేమెంట్ విధానం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మన దేశంలో ఇలా ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌లో డిజిటల్ పేమెంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన తొలి యాప్‌గా హైక్ మెసెంజర్ పేరుగాంచింది. హైక్ ఈ మధ్యే హైక్ వాలెట్ పేరిట తన మెసెంజర్లో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేగా త్వరలో వాట్సాప్‌లోనూ డిజిటల్ పేమెంట్స్ విధానం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే వాట్సాప్ ప్రతినిధులు దేశంలోని ఎస్బీఐ సహా పలు ప్రైవేటు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. అవి సఫలం అయితే యూపీఐ విధానం ద్వారా వాట్సాప్‌లో డిజిటల్ పేమెంట్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది..! దీంతో యూజర్లు వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపుకున్నంత తేలిగ్గా నగదు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బిల్లులు కూడా చెల్లించవచ్చు..!