దేశంలో టిక్‌టాక్ సహా 59 చైనా యాప్స్‌ని ప్రభుత్వం నిషేధించడంతో వాటికి ప్రత్యామ్నాయ యాప్స్‌ని రూపొందించే పనిలో భారతీయ ఔత్సాహికులు బిజీగా ఉన్నారు. ముఖ్యంగా అత్యంత ఆదరణ పొందిన టిక్ టాక్ లేని లోటును పూడ్చేందుకు కొత్త కొత్త యాప్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రముఖ గానా మ్యూజిక్ యాప్ హాట్‌షాట్స్ పేరుతో వీడియో ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాట్‌ఫామ్ టిక్ టాక్ లాగానే ఉంది.ఇప్పటికే యూజర్లు వీడియోలు క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. వీడియోలు, సక్సెస్ స్టోరీలు క్రియేట్ చేసి అప్లోడ్ చేయొచ్చని గానా చెబుతోంది. ఇప్పటికే హాట్‌షాట్ ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీలు, ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు మ్యూజిక్, కామెడీ, డ్యాన్స్ వీడియోలను 'హాట్‌షాట్ ఛాలెంజెస్' పేరుతో అప్లోడ్ చేస్తున్నారు. గానా హాట్‌షాట్స్‌లో రియాజ్ అలీ, అవ్నీత్ కౌర్, నేహా కక్కర్, దర్శన్ రావల్ లాంటి ప్రముఖ సెలబ్రిటీలు సైతం వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు.