ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 09, 2020, 08:50 PM

ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర పరిసర ప్రాంతాలలో 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. అయితే ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెబుతోంది. రాబోయే రెండు మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు కొన్నిచోట్ల, రేపు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వారు ప్రకటించారు. మరో రెండు రోజులు కూడా వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. వారి తెలిపిన వివరాల ప్రకారం మెదక్, సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, జనగామ, యాదాద్రి భువనగిరి మరియు వికారాబాద్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com