ఓ జిమ్ ట్రైనర్, పోలీస్ మధ్య పుషప్స్ ఛాలెంజ్ నడిచింది. దీన్ని వీడియో తీసి... ట్విట్టర్లో పోస్ట్ చేశారు యూజర్ సాగర్ సింగ్ కల్సీ. ఈ వీడియోలో... చుట్టూ పోలీసులూ, ప్రజలూ ఉండగా..జిమ్ ట్రైనర్, పోలీస్ రోడ్డుపై పుషప్స్ చేయడం మొదలుపెట్టారు.అసలీ ఛాలెంజ్ ఎందుకొచ్చిందంటే..ఆ దేశ జిమ్ ట్రైనర్లు... తిరిగి పనికి వెళ్లే విషయమై ఆందోళనకు దిగి ధర్నా చేపట్టారు. దాంతో వాళ్లను శాంతింపజేయడానికి ఈ ఛాలెంజ్ తీసుకున్నారు పోలీసులు.పోలీసులపై కోపంతో ఉన్న జిమ్ ట్రైనర్... పోలీసులకు ఫిట్నెస్ లేదని అన్నాడు. దమ్ముంటే తనతో పుషప్స్ చెయ్యాలని ఛాలెంజ్ విసిరాడు. దాంతో పోలీసుల్లో ఒకరు ముందుకొచ్చారు. మిగతా పోలీసులు... వద్దొద్దు... వాళ్లు మనల్ని కావాలనే రెచ్చగొడుతున్నారు అంటే... ఆ పోలీస్... మరేం పర్లేదు సార్.. ఏం పోయింది ఓసారి చేసి చూపిద్దాం అంటూ ముందుకొచ్చారు.