ఖాట్మండు: నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమాల్ దహాల్ అలియాస్ ప్రచండ తన పదవికి రాజీనామా చేశారు. రాజకీ య ఒప్పందంలో భాగంగానే రాజీనామా చేసినట్టు ప్రచండ తెలిపారు. తన రాజీనామా గురించి వెల్లడించిన తర్వాత ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిం చారు. గత ఏడాది ఆగస్టులో ప్రధానిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. నేపాల్ కొత్త ప్రధానిగా నేపాలీ కాంగ్రెస్ నేత షేర్ బహదూర్ దేవ్ బా నియమితులవనున్నారు.