ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జెట్‌ స్పీడ్గతో రోడ్గ నెట్‌వర్క్‌

Andhra Pradesh Telugu |   | Published : Thu, May 18, 2017, 02:11 AM

 (వెలగపూడి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి) :  విజయవాడ,  రాష్ర్టంలో జాతీయ రహదారులుగా ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటించిన 1,249 కి.మీ పొడవైన ఎనిమిది రోడ్లు శరవేగంగా అభివద్ధి కానున్నాయి. అనంతపురం, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లోని ఎన్‌హెచ్‌ 167-ఎ, 167-బి, 516-ఇ, 365-బిబి, 544-డిడి, 544-ఇ, 167, 216- ఎ నెంబరు రహదారులకు సంబంధించి అన్ని అనుమతులు లభించాయి. వీటి అభివద్ధికి రూ.1,793 కోట్ల వ్యయం కానుంది. ఈ వివరాలను బుధవారం సచివాలయంలో జరిగిన రహదారులు-భవనాల శాఖ సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు.  అలాగే  అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డును 16, 65వ నెంబర్‌ జాతీయ రహదారులను కలిపే బైపాస్‌ రహదారిగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. రాష్ర్టంలో రహదారుల అభివద్ధికి తిరుపతి ఐఐటీని నాలెడ్గ్జ పార్ట్‌నర్‌గా గుర్తించగా, ఎన్‌ఏసీతో భాగస్వామ్యం కోసం ఎంవోయూకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు.     


మధ్యప్రదేశ్‌ తరహా రహదారుల నిర్వహణ వ్యవస్థ...


   జాతీయ రహదారులు సహా రాష్ర్టంలోని రహదారుల నిర్వహణకు పటిష్ట వ్యవస్థ ఏర్పాటు ఎంతవరకు వచ్చిందో అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్‌లో రహదారుల నిర్వహణ బావుందని, ఆ వ్యవస్థను అధ్యయనం చేసి రాష్ర్టంలోనూ నెలకొల్పాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ రహదారుల నిర్వహణ వ్యవస్థ కోసం ఇప్పటికే 13 జిల్లాల్లో 41,300 కి.మీ మేర రహదారుల సమాచార సేకరణ పూర్తికాగా, 10 జిల్లాలు ప్రణాళిక అమలు దశకు చేరుకున్నాయి. మిగిలిన మూడు జిల్లాలు జూన్‌ 15 నాటికి సిద్ధం కానున్నాయి. ఈ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా తమ శాఖలో ఫీల్డ్‌ ఇంజినీర్లకు శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. 


2022 నాటికి అత్యున్నతంగా రాష్ర్ట రహదారులు...


   వర్షాకాలం వచ్చే నాటికి రహదారుల మరమ్మతులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గోతులను, గుర్తించిన 1,013 ప్రమాదకర ప్రాంతాలను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. 2022 నాటికి అత్యున్నత రహదారుల విషయంలో రాష్ర్టం దేశంలో మొదటి మూడు రాష్ట్రాలలో ఒకటిగా వుండాలని స్పష్టం చేశారు.


     గత ఆర్ధిక సంవత్సరంలో సెం్టల్‌ రోడ్‌ ఫండ్‌ కింద రూ.1,690 కోట్లతో 1,735 కి.మీ. మేర రహదారికి సంబంధించి మొత్తం 132 పనులను చేపట్టగా అందులో 61 పనులు నిర్మాణంలో, మరో 71 పనులు టెండర్‌ దశలో వున్నాయి. ఈ పనులు 2018 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 


రెండు జిల్లాల్లో మార్కింగ్‌ పూర్తి : అనంతపురం-అమరావతి నేషనల్‌ ఎక్స్‌ప్రెస్‌ వేకు సంబంధించి రహదారి మార్కింగ్‌ అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పూర్తికాగా ప్రకాశం, గుంటూరు, కడప జిల్లాల్లో ఇంకా కొనసాగుతున్నట్టు ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. 


మండల కేంద్రాలకు రెండు వరుసల రహదారులు...


  ఎటువంటి విఘాతం లేకుండా ప్రయాణించేందుకు మండల కేంద్రాలను, గ్రామాలను కలుపుతూ రహదారులను నిర్మించడం, వున్నవాటిని విస్తరించడం పైనా ముఖ్యమంత్రి చర్చించారు. మండల కేంద్రాలను కలిపే 2,062 కి.మీ రహదారులను రెండు వరుసలుగా నిర్మించేందుకు రూ. 2,100 కోట్ల వ్యయం కానుందని అంచనా. 


స్టేట్‌ హైవేలకు మహర్దశ...


    వచ్చే ఐదేళ్లలో స్టేట్‌ హైవేలు అన్నింటినీ రెండు వరుసల రహదారులుగా విస్తరించాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. 5,931 కి.మీ. పొడవైన స్టేట్‌ హైవేలను రెండు వరుసలుగా, పట్టణ ప్రాంతాల్లోని 120 కి.మీ స్టేట్‌ హైవేలను నాలుగు వరుసలుగా అభివ ద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది 774 కి.మీ రహదారిని రెండు వరుసలుగా విస్తరిం చేందుకు రూ. 938 కోట్లను రాష్ర్ట ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇందుకోసం రూ.210 కోట్లు బడ్జెట్‌లో కేటాయించగా, మరో రూ. 728 కోట్లు అదనంగా సమకూర్చాల్సి వుంది.  


గ్రామీణ రహదారుల నిర్మాణంలో 99.2% లక్ష్యం పూర్తి...


   2016-17 సంవత్సరానికి గాను గ్రామీణ రహదారుల నిర్మాణం విషయంలో 99.2% లక్ష్యాన్ని, గ్రామాలకు వంతెనల నిర్మాణంలో 88.1% లక్ష్యాన్ని రహదారులు, భవనాల శాఖ సాధించగలిగింది. మొత్తం 1,056 కి.మీ మేర గ్రామీణ రహదారులను, గ్రామీణ ప్రాంతాలకు 37 వంతెనలను నిర్మించింది. ఇందుకోసం రూ. 572 కోట్లు వ్యయమైంది. ఈ ఆర్ధిక సంవత్సరానికి 480 కి.మీ వరకు గ్రామీణ రహదారులను, గ్రామాలకు 25 వంతెనలను నిర్మించాలని ముఖ్యమంత్రి లక్ష్యాన్ని నిర్దేశించారు. 


వీసీఐసీ పరిధిలో 11 రోడ్ల అభివృద్ధి...


   ఇంకా విశాఖ-చెన్నయ్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ మౌలిక వసతుల కల్పనలో భాగంగా 372 కి.మీ మేర మొత్తం 11 రోడ్లను రూ.3,806 కోట్లతో అభివద్ధి చేసేందుకు గుర్తించినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. 


కనకదుర్గ ఫ్లైఓవర్‌ ఆలస్యంపై అసహనం...


  కృష్ణా పుష్కరాల నాటికి పూర్తిచేయాలని భావించిన విజయవాడలోని కన దుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని ఇప్పటికీ నిర్మాణ సంస్థ పూర్తి చేయకపోవడంపై సమీక్షలో ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణం అసాధ్యమని కొందరు అడ్డుతగిలినా తాము నిర్మించి చూపిస్తున్నామని, అలాంటి ప్రాజెక్టు పనులను నత్తనడకన సాగిస్తున్నారని అన్నారు. అక్టోబర్‌ 2న ఎట్టి పరిస్థితుల్లో ఫ్లైఓవర్‌ నిర్మించి తీరాలని డెడ్గలైన్‌ విధించారు. 


రాష్ర్ట ప్రభుత్వానికే వైకుంఠమాల భూసేకరణ బాధ్యత...


    తిరుమలలో వైకుంఠమాల వలయ మార్గం నిర్మాణానికి అవసరమైన భూ సేకరణను రాష్ర్ట ప్రభుత్వమే పూర్తి చేసి ఇవ్వాల్సిందిగా ఎన్‌హెచ్‌ఏఐ కోరినట్టు అధికారులు ముఖ్యమంత్రి ద ష్టికి తీసుకొచ్చారు. చెన్నయ్‌ కోల్‌కతా జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించే క్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చర్ల, రణస్థలం దగ్గర బైపాస్‌ మార్గాన్ని వేయాల్సి వుందని చెప్పారు. 


ఆన్‌లైన్‌లో అన్ని రహదారుల ప్రాజెక్టుల వివరాలు...


   రహదారుల నిర్మాణం విషయంలో ప్రజల్లో అత్యధిక సంత ప్తి కలిగించాలని, ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించి ఫోటోలతో సహా, పనుల పురోగతి మైలురాళ్లను ఆన్‌లైన్లో పొందుపరచాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రాజెక్టు ఎప్పుటికి పూర్తవుతుంది, ఎంతవరకు వచ్చింది అనే విషయాలు నెలనెలా అప్డేట్‌ చేయాలన్నారు. ప్రాజెక్టులు సకాలం లో పూర్తి చేసేందుకు పనుల్లో వేగం పెంచాలని స్పష్టం చేశారు. రద్దీకి అను గుణంగా రహదారుల విస్తరణ జరగాలని సూచించారు. రాష్ర్టంలో ఈ మూడేళ్ల లో రహదారుల నిర్మాణానికి నియోజకవర్గాల వారీగా ఎంత ఖర్చు పెట్టింది, ఏయే రోడ్లు నిర్మించినది తదితర వివరాలు అందించాల్సింది ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com