ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్ స్వదేశీ ఉద్యమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 19, 2017, 12:28 AM

  -బై అమెరికన్‌, హైర్‌ అమెరికన్‌'


   -అధ్యక్షుని సరికొత్త మం్త్రం


   -మరింత కఠినంగా హెచ్‌1+బి వీసా నిబంధనలు


   -విదేశాల మోసపూరిత విధానాలు అడ్డుకుంటాం'


వాషింగ్టన్‌ : కొత్తగా అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్‌‌డ ట్రంప్‌ తన …దైన శైలిలో నూతన విధానాలు అనుసరిస్తూ ముందుకు పోతున్నారు. ముఖ్య ంగా హెచ్‌1-బి వీసాలకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసేలా ట్రంప్‌ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పుడు ఆయన ఏకంగా స్వదేశీ ఉద్యమం నినాదాన్ని ఇచ్చారు. `బై అమెరికన్‌, హైర్‌ అమెరికన్‌' (అమెరికా వస్తువులే కొనాలి, అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలి) అంటూ సరికొత్త మంత్రాన్ని ట్రంప్‌ జపిస్తున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి ఎదుర య్యే వ్యాపార మోసాలను అరికట్టేందుకు ఈ నినాదాన్ని తీసుకువచ్చామని ఆయన చెబుతున్నారు. `మా వ్యాపార నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నాం. ముఖ్యంగా విదేశాలు అనుసరించే మోసపూరిత విధానాలను అడ్డు కుంటాం. మా కంపెనీల్లో, మా శ్రామికులు తయారు చేసిన ఉత్పత్తులే మాకు కావాలి. మేడ్‌ ఇన్‌ ద యుఎస్‌ ఈ నాలుగు మాటలే మాకు రాజముద్ర' అని బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ ఆవిష్కరణ సందర్భంగా ట్రంప్‌ స్పష్టం చేశారు. `మీ అధ్యక్షుడిగా నేను అన్నీ చేయడానికి సిద్ధం. గొప్పవాళ్లెన అమెరికన్ల శక్తి, స్ఫూర్తిని బయటకు తీసుకువస్తా. ఇదే మా నవ జీవన మంత్రం. బై అమెరికన్‌, హైర్‌ అమెరికన్‌' అని ట్రంప్‌ అనడంతో చప్పట్లు మారుమోగాయి. నవంబర్‌ నుంచి ఉద్యోగాల కల్పన ప్రారంభ ƒమైందని, అమెరికాలో వివిధ కంపెనీలు పరిశ్రమలను ప్రారంభించడం చూస్తు న్నామని ఆయన చెప్పారు. 


     మన దేశంలోనే మన ఉద్యోగాలు ఉంటాయని ఆయన అన్నారు. ఫోర్‌‌డ, జనరల్‌ మోటార్‌‌స, ఫియట్‌ ఇవి ఉదాహరణ మాత్రమేనని. మరికొన్ని ఈ వరుసలో ఉన్నాయని, వేలాది ఉద్యోగాలు స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఆయా కంపెనీలు కృషి చేస్తున్నాయని ఆయన తెలియజేశారు. వ్యాపార ధోరణి మారిందని, ఆ విషయం వారికి తెలుసుసని, ఇప్పటికే వారు మారిపోయారని ట్రంప్‌ పేర్కొన్నారు. అరిజోనాలో ఇంటెల్‌ కంపెనీ కొత్తగా ఏర్పాటు చేసే ప్లాంట్‌ లో 10 వేల మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటిం చారు. ఇందు కోసం వారు బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తున్నారని ట్రంప్‌ చెబుతూ, స్నేహపూర్వక వ్యాపార కేంద్రంగా యుఎస్‌కు మారనుందని అన్నారు. `మేము అమెరికాను ప్రేమిస్తాం.    అమెరికా రక్షణ కోసం ముందుకు సాగుతాం. మా శ్రామికులను ప్రేమిస్తాం. మా శ్రామికులను రక్షించుకుంటాం. మా ఉద్యోగాల కోసం పోరాడతాం. మా కుటుంబాల కోసం పోరాడతాం. మరిన్ని ఉద్యోగాల కోసం, మెరుగైన వేతనాల కోసం పోరాడతాం. ఇక్కడి పౌరులు దేశానికి విశ్వాస పాత్రులై ఉంటారు. నన్ను నమ్మండి' అని ట్రంప్‌ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com