న్యూఢిల్లీ : మోటో ఉత్పత్తుల భారత్‌లోకి ప్రవేశపెట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా లెనోవో ఘనంగా మోటోరోలా కంపెనీ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. ఆది, సోమవారాలలో రెం డు రోజుల పాటు `మోటో డేస్ ఆఫర్స' పేరుతో ఈ వేడుకలను సంస్థ ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట ప్లాట్‌ఫామ్‌పై సెలబ్రేట్ చేస్తోంది. ఈ సందర్భ ంగా మోటో స్మార్ట ఫోన్లపై బపర్ ఆఫర్లు ప్రకటిం చింది. సెలబ్రేషన్సలో భాగంగా మోటో డ్, డ్ ప్లే స్మార్ట ఫోన్లపై రూ. 20 వేల వరకు ఎక్సే్చంజ్ డిస్కౌంట్‌ను, కొనుగోలుపై రూ. 2000 డిస్కౌంట్‌ను సంస్థ ఆఫర్ చేసింది. మోటో జి టర్బో ఎడిషన్, మోటో ఎం వంటి డివైస్‌లకు ఫ్లాట్‌పై రూ. 1000 వరకు డిస్కౌంట్‌ను సంస్థ ప్రకటించింది. ఇండస్ ఇండ్ బ్యాంకు క్రెడిట్ కార్డు యూజర్లకైతే 10 శాతం డిస్కౌంట్‌ను కూడా ఇది ఆఫర్ చేయనుంది. మోటో డ్ ఫోన్ అసలు ధర రూ. 39,999. మోటో డ్ ప్లే అసలు ధర రూ. 24,999. ఈ సేల్ నేపథ్యంలో మోటోరోలా తయారుచేసిన నెక్సస్ 6ను డిస్కౌంట్ ధరకు విక్రయించనుంది.
32జిబి వేరియంట్ రూ. 19,999కి, 64జిబి వేరియంట్ రూ. 25,999కి అందుబాటులో ఉండనున్నాయి. అదే విధంగా మోటో జి (రెండవ తరం) 16జిబి వేరియంట్ రూ. 6,999కి, మోటో జి (3వ తరం) 8జిబి వేరియంట్ ఫోన్ రూ. 7,999కి కంపెనీ విక్రయించనుంది.