ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిఎం జగన్ ఇంటికి సమీపంలో పేలుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2019, 06:05 PM

తాడేపల్లిలోని ఎపి సిఎం జగన్ ఇంటికి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పైడమ్మ అనే మహిళ తీవ్రంగా గాయపడింది. దీంతో పైడమ్మను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాడేపల్లిలోని ప్రకాశ్ నగర్ లో ఉన్న ఇంట్లో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఆ ఇల్లు ధ్వంసమైంది. ఈ పేలుడు స్థానికంగా కలకలం రేపింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. తాడేపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com