ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సర్వేపల్లి ఎమ్మెల్యేకి డబ్బులివ్వాలన్న‌ ఎంపీడీవో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2019, 09:40 AM

 కోటంరెడ్డి ని రాజ‌కీయంగా ఎదుర్కోలేకే ఎంపీడీవో స‌ర‌ళ‌ను అడ్డు పెట్టుకుని కొంరు డ్రామా న‌డిపిస్తున్నార‌ని   లేఅవుట్‌ యజమాని కృష్ణారెడ్డి , కోటం రెడ్డి ముఖ్య అనుచ‌రుడు వైసిపి నేత బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. కోటం రెడ్డి అరెస్టు అనంత‌రం వారు మీడియాలో మాట్లాడుతూ  ఎంపిడిఓ పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో అన్నీ అవాస్త‌వాలే ఉన్నాయ‌ని, దాడి జ‌రిగింద‌ని చెపుతున్న రోజున త‌మ శాస‌న‌స‌భ్యుడు ఆ ప్ర‌దేశానికి కూడా రాలేద‌ని, ఇందులో ఏదో రాజకీయ కుట్రకోణం దాగి ఉందని అన్నారు. . తమ లేఅవుట్‌కు అన్ని అనుమతులున్నాయని, తాగునీటి కనెక్షన్‌ కోసమే అభ్యర్థించామని కృష్ణారెడ్డి చెప్పారు. అయిన‌ప్ప‌టికీ అనుమతి కోసం సర్వేపల్లి ఎమ్మెల్యేకి డబ్బులివ్వాలని ఎంపీడీవో డిమాండ్‌ చేశారని ఆరోపించార‌ని తాము నిరాక‌రించ‌డంతో ఈ రాద్ధాంతం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com