ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెల్ నంబ‌ర్లు 11 అంకెలుగా మారుతాయ‌ట‌

national |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2019, 01:36 AM

ఇప్ప‌టివ‌ర‌కు మన దేశంలో 10 అంకెలుగా మొబైల్ ఫోన్ నంబరుల ఇక ముందు 11 అంకెలుగా మ‌ర్చేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)  ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం  9తో, మరికొన్ని 8, 7, 6లతో ప్రారంభమవుతున్న ఈ ఫోన్ నంబర్లలో ఒక అంకె అదనంగా కలవనుందని తెలుస్తోంది.  2050వ సంవత్సరం వరకు మన దేశంలో పెరగనున్న మొబైల్ నంబర్ల సంఖ్యకు అనుగుణంగా  ఈ నిర్ణ‌యాన్ని ట్రాయ్ తీసుకున్న‌ట్టు చెపుతున్నారు. కాగా  ప్రస్తుతం మనం వాడుతున్న 10 అంకెల సిరీస్‌లో 250 కోట్ల మందికి మాత్రమే సేవలందించవచ్చని, మ‌రో అంకెను పెంచ‌డం ద్వారా దేశ జ‌నాభాకు త‌గ్గ‌ట్టు ఫోన్ల‌ని వినియోగంలోకి తీసుకురావ‌చ్చ‌ని టెలికాం వ‌ర్గాలు చెపుతున్నాయి. మ‌రి ఈ నిర్ణ‌యం ఎంత‌వ‌ర‌కు అమ‌ల‌వుతుందో చూడాలి.  


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com