ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్సార్ పెళ్లి కానుక గా మారిన చంద్రన్న పెళ్లి కానుక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2019, 02:52 PM

చంద్రన్న పెళ్లికానుక పథకానికి పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రన్న పెళ్లి కానుకను.. వైఎస్సార్ పెళ్లి కానుకగా మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలలో ఆడపిల్ల పెళ్లి భారం కాకుండా ఉండేందుకు నాటి టీడీపీ ప్రభుత్వాధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చందన్న పెళ్లి కానుక పేరుతో పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఎంతో మంది పేదలు లబ్దిపొందారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి.. వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ పథకం పేరును వైఎస్సార్ పెళ్లి కానుకగా మారుస్తూ ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com