ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభినందన్‌ వర్తమాన్‌కు వీరచక్ర పురస్కారం

national |  Suryaa Desk  | Published : Thu, Aug 08, 2019, 10:52 AM

వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్తమాన్‌కు ప్రభుత్వం వీరచక్ర పురస్కారం అందజేయనుంది. ఐఏఎఫ్‌ సిఫార్సుతో కేంద్రం అభినందన్‌కు వీరచక్ర పురస్కారానికి ఎంపిక చేసింది. ఆగస్టు 15న వింగ్‌ కమాండర్‌ అభినందన్‌కు వీరచక్ర పురస్కారం ప్రదానం చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 27న పాకిస్తాన్‌ ఎఫ్‌ 16 విమానాలతో పోరులో అభినందన్‌ నడుపుతున్న మిగ్‌ 21 యుద్ధ విమానాన్ని పాకిస్తాన్‌ కూల్చివేయడంతో పాక్‌ భూభాగంలోకి దిగిన విషయం తెలిసిందే. పాక్‌ బలగాల చేతుల్లో బందీ అయిన ఐఏఎఫ్‌ పైలట్‌ అభినందన్‌ మాతృభూమి రహస్యాలపై నోరువిప్పని స్థైర్యంతో రెండు రోజుల అనంతరం భారతావనిలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ధైర్యసాహసాలతో యావత్‌ దేశానికి హీరోగా మారిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌కు కేంద్రం వీరచక్ర పురస్కారానికి ఎంపిక చేసింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com