ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు కడపలో జగన్ టూర్ - షెడ్యూల్ ఇదీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 07, 2019, 01:52 PM

గురువారం ఏపీ సీఎం జగన్‌  సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విధుల చేసింది. దీని ప్రకారం జగన్ గురువారం  ఉదయం 9.35 గంటలకు విమానంలో సీఎం కడప చేరుకుని  అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయల్దేరి  పులివెందుల వెళ్తారు   అక్కడి నుంచి భాకరాపురం పాల కేంద్రానికి  రోడ్డు మార్గం  ద్వారా వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన  దివంగత మాజీ మంత్రి వైఎస్‌ వివకానందరెడ్డి విగ్రహావిష్కరణ సభలో  పాల్గొంటారు. తదుపరి  అక్కడి ఆర్‌అండ్‌బి అతిథి గృహానికి చేరుకుని 11.15 గంటల నుంచి పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సమావేశం నిర్వహిస్తారు. భోజనానంతరం ఒంటిగంటకు అనంతపురం జిల్లా పెనుగొండకు వెళ్తారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com