ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విదేశీ మహిళపై అత్యాచారం

national |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2019, 04:01 PM

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ విదేశీ మహిళపై ఇద్దరు గుర్తుతెలియని ఆగంతకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి...కెన్యాకు చెందిన ఓ విదేశీ మహిళ ఓ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూ...సెక్టార్ 5లోని ఓ హాస్టల్ లో నివాసం ఉంటోంది. గత సోమవారం విదేశీ యువతి ఆసుపత్రిలో డ్యూటీ ముగించుకొనేటప్పటికీ బాగా ఆలస్యమైంది. దీంతో ఆ మహిళ ఆసుపత్రి నుంచి బయటకు రాగానే రోడ్డు మొత్తం నిర్మానుష్యంగా మారింది. బస్సులు కూడా రాకపోవడంతో అటుగా వెళ్తున్న ఒక ఆటో కనిపించింది. దీంతో ఆటోను ఆపి తన హాస్టల్ కు వెళ్లాల్సిందిగా కోరింది. దీంతో ఆటో డ్రైవర్ వెంటనే ఆమెను ఆటోలో ఎక్కించుకొని కాస్త దూరం తీసుకెళ్లాడు. అంతలో ఒక వ్యక్తి కూడా ఆటో ఎక్కాడు. అతను కూడా ఆ యువతి ఉండే ప్రదేశంలోనే ఉంటాడని ఆమెకు నచ్చచెప్పడంతో ఒప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఎంత దూరం వెళ్లినా హాస్టల్ రాకపోవడంతో ఆ యువతికి అనుమానం కలిగింది.


భయంతో ఆటో డ్రైవర్ ను నిలదీయగా, ఆటోలోని మరో వ్యక్తి మహిళను గట్టిగా పట్టుకొని ఆమె నోరుమూయించాడు. అనంతరం ఆటోను నిర్మానుష్యమైన నిర్మాణంలో ఉన్న ఒక భవంతి వద్ద ఆపి, ఇద్దరూ కలిసి ఆ మహిళను అందులోకి బలవంతంగా తీసుకెళ్లారు. తర్వాత ఆమెపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం మహిళ అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. రంగలోకి దిగిన పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com