ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈపీఎఫ్ విత్‌డ్రా నిబంధనను మార్చిన ఈపీఎఫ్‌వో

national |  Suryaa Desk  | Published : Mon, Jul 22, 2019, 11:36 AM

మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీరు పీఎఫ్ విత్‌డ్రా అంశానికి సంబంధించిన విషయాలను ఎప్పటి కప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటారేమో రూల్స్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా పీఎఫ్ విత్‌డ్రా‌కు సంబంధించి ఒక నిబంధన మారింది. ఉద్యోగుల వేతనంలో నుంచి కొంత మొత్తం ప్రతి నెలా ఈపీఎఫ్ అకౌంట్‌కు జమవుతూ ఉంటుంది. కంపెనీకి కూడా ఉద్యోగి కంట్రిబ్యూషన్‌కు సమాన మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తుంది. ఉద్యో్గులు ఈపీఎఫ్ అకౌంట్‌లోని డబ్బులను అవసరాలకు అనుగుణంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. పీఎఫ్ విత్‌డ్రా చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఇటీవల పీఎఫ్ విత్‌డ్రాకు సంబంధించి ఒక రూల్‌ను మార్చినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. దీని ప్రకారం ఉద్యోగి ఆధార్ నెంబర్ యూఏఎన్ నెంబర్‌తో అనుసంధానమై ఉంటే అప్పుడు ఆఫ్‌లైన్‌లో పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బుల్ని విత్‌డ్రా చేసుకోవడం కుదరదు. ఇలాంటి సందర్భాల్లో ఈపీఎఫ్‌వో పీఎఫ్ క్లెయిమ్స్‌ను తిరస్కరిస్తుంది. యూఏఎన్‌తో ఆధార్ లింక్ అయ్యి ఉంటే అప్పుడు ఆన్‌లైన్‌లోనే పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com