పాఠాలు నేర్పాల్సిన పంతులమ్మ..పాఠాలు పక్కన పెట్టి బాలుడితో రాసలీలలు మొదలు పెట్టింది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సి పోయి..కొత్త కొత్త అలవాట్లు నేర్పించి..లొంగదీసుకుంటూ తన కోరిక తీర్చుకుంటుంది. ఈ దారుణం అమెరికాలో జరగగా..వివరాలు ఇలా ఉన్నాయి. ఓ మహిళ(28) అమెరికాలోని అరిజోనా స్టేట్ లాస్ బ్రిసాస్ అకాడమీలో టీచర్‌గా పని చేస్తోంది. స్కూల్లో ఆమె ఓ పదమూడేళ్ల మైనర్ విద్యార్థితో శారీరక సంబంధం పెట్టుకుంది. మొదట్లో అతడ్ని లైంగికంగా వేధించి లొంగదీసుకున్న ఆమె.. ఆ తర్వాత అతడితో శృంగార కార్యకలాపాల్లో మునిగిపోయింది.అక్కడ ఇక్కడా అని తేడా లేకుండా.. క్లాస్రూమ్, కారులో, ఆమె ఇంట్లో.. ఇలా దాదాపు 10 సార్లు అతడితో పని చేయించుకుంది. అంతేకాదు.. అతడికి ఉద్రేకం పెరగడానికి ఏవేవో మెటీరియల్ అందజేసి, వాటిని ప్రయత్నిద్దామని సూచించింది. కాగా ఆమెకు ఇప్పటికే పెళ్లి అయ్యింది. భర్త కూడా ఆమెతో పాటే ఉంటుండగా ఆమె ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం.
అయితే, బాలుడి ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు అతడి ఫోన్లో మానిటరింగ్ యాప్ ఇన్స్టాల్ చేశారు.ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎటు వెళ్తు్న్నాడు? తదితర విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో.. వారికి ఊహించని షాక్ తగిలింది. టీచర్ తమ అబ్బాయిని ప్రలోభపెట్టి, అతడితో సెక్స్ చేస్తోందన్న విషయాన్ని తెలుసుకున్నారు. వెంటనే ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆమెను అరెస్టు చేశారు. తమ కుమారుడి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటోందని ఆరోపించారు. దీనిపైవాదోపవాదనలు సాగగా, నిందితురాలికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.