త్రివేండ్రం: లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో కేరళ రవాణాశాఖ మంత్రి శశీంద్రన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన తన రాజీనామా పత్రాన్ని సీఎం పినరయ్ విజయన్‌కు సమర్పించారు. ఒక లోకల్ ఛానెల్లో లైంగిక వేధింపులతో కూడిన ఆడియో బ్రాడ్కాస్ట్ కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు శశీంద్రన్ ఆదివారం కోజికోడ్‌లో ప్రకటించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కూడా వెల్లడించినట్లు చెప్పారు. రాజీనామా చేసినంత మాత్రాన తాను తప్పు ఒప్పుకున్నట్లు కాదని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై లోతుగా విచారణ చేపట్టాలని సీఎంకి విన్నవించినట్లు చెప్పారు. అయితే పార్టీ, కూటమి విలువలను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే పదవికి రాజీనామా చేస్తున్నానని వివరించారు.