ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాకు పదవులు ముఖ్యం కాదు..: నారా రోహిత్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2019, 08:34 PM

పెదనాన్న, తన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు తననెంతగానో బాధించాయన్నారు సినీనటుడు నారా రోహిత్‌. నారా పేరును రాష్ట్రాభివృద్ధికి బ్రాండ్‌గా మార్చడంలో తన పెదనాన్న, సీఎం చంద్రబాబు కృషి గొప్పదని అన్నారు. తమ కుటుంబ సభ్యులపై అసత్య ప్రచారాలు చేస్తూ చీలికలు తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్వార్థ రాజకీయాల కోసం అన్నదమ్ముల మధ్య విభేదాలు తేవొద్దని, నారా పేరును నిలబెట్టేందుకు తమ కుటుంబం నుంచి ఒక్కరు చాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం తమ కుటుంబంపై బురదజల్లొద్దని చెప్పారు. చంద్రబాబును ఆదర్శంగా తీసుకొని తమ కుటుంబం నడుస్తోందని, తమ కుటుంబాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేశారనే ఆరోపణ అబద్ధమని స్పష్టం చేశారు. చంద్రబాబు ఏటా తమతో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకొంటారని, ఓ సీఎంలా కాకుండా కుటుంబ పెద్దగా తమతో గడుపుతారని రోహిత్‌ గుర్తు చేసుకున్నారు. తన తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లే ఇంటికి పరిమితమయ్యారని తెలిపారు. 
ఎంపీ పదవి కోసం చిన్నాన్ననే కొట్టిన చరిత్ర వైఎస్‌ కుటుంబానిదని రోహిత్‌ మండిపడ్డారు. తమకు పదవులు ముఖ్యం కాదని, కోర్టులు, జైళ్ల చుట్టూ తిరిగేవారికేం  తెలుసు కుటుంబాల విలువ అంటూ రోహిత్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com