వైయస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా విద్యాంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తే, ప్రస్తుత సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఏపీలో బెల్టుషాపులను ఎలా నిర్వహిస్తున్నారో.. చిన్నపిల్లల్ని.. విద్యార్థులని పెట్టి మద్యం అమ్మిస్తున్నారు.
ఇది ఎక్కడో కాదు. చంద్రబాబుకి ఓటేసిన ఆంధ్రప్రదేశ్‌లోనే. తణుకులో ఇలా విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు వెలిశాయి. టీడీపీ నేతలే మద్యం షాపులు, బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. ఇళ్ల మధ్యలో, మహిళలు నడిచేమార్గాల్లో, చిన్నపిల్లల్ని పెట్టి ఇలా మద్యం అమ్ముతున్నారు. ఇదేనా.. మంచి ప్రభుత్వం?. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. పిల్లలని పెట్టి మద్యం అమ్మించడం భావ్యమేనా?’’ అని రోజా సూటిగా ప్రశ్నించారు.