శత్రువులతో చేతులు కలిపి అన్న జగన్‌పై కుట్రలు పన్నడం ఎవరి కోసమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. తండ్రి మరణానికి కారణమైన చంద్రబాబు, కాంగ్రె్‌సతో చేతులు కలపడం అత్యంత బాధాకరమన్నారు. జగన్ బెయిల్‌ను రద్దు చేయించేందుకు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. అన్నను వేటాడి, వెంటపడి విషపు కాటు వేసే చెల్లెమ్మను ఎక్కడా చూడలేదన్నారు. ఆదివారమిక్కడ సొమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. షర్మిలది ఆస్తి తగాదా కాదని, అధికారం కోసం తగాదా అని అన్నారు.
శత్రువులకు మేలు చేసేందుకు సొంత అన్నకు అన్యాయం చేసే వాళ్లను తానెక్కడా చూడలేదన్నారు. వైఎస్ చనిపోవడానికి కారకులెవరో గుండెపై చేయి వేసుకుని చెప్పాలని షర్మిలను డిమాండ్ చేశా రు. తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చారని అంటున్నారని.. దీనికి వంద శాతం కారణం షర్మిల కాదా అని ప్రశ్నించారు. షేర్ సర్టిఫికెట్లు లేకుండా, అన్న సంతకాలు లేకుండా, గిఫ్ట్ డీడ్ లేకుండా, దొంగ సంతకాలతో ఎలా షేర్లు బదిలీ చేసుకున్నారని అడిగారు. ‘మీరు ఎవరి కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు..? ఆ కన్నీళ్లకు విలువ లేదు.. వైఎస్ ఆత్మ క్లోభిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు ఎజెండా ప్రకారం జగన్‌ను జైలుకు పంపించేందుకు షర్మిల, ఆయన ఒక్కటయ్యారని ప్రజ లు భావిస్తున్నార ని చెప్పారు. జగన్, షర్మిల మధ్య జరిగిన అన్ని విషయాలూ తనకు తెలుసని, ఇప్పటికైనా చంద్రబాబుతో కలిపిన చేతులు విడదీయాలని సూచించారు. ఈ ఎపిసోడ్‌కు ముగింపు పలకాలన్నారు.