రాజకీయాల్లో హత్యలు ఉండవని.. ఆత్మహత్యలే ఉంటాయనడానికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితమే తాజా ఉదాహరణ అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్‌సీఎల్‌టీలో తల్లిపై, చెల్లిపై కేసులేయడం ద్వారా జగన్ పూర్తిగా పాతాళానికి కూరుకుపోయారన్నారు. అందులో నుంచి అతన్ని బయటకు తీయడం దేవుడెరుగు, జగన్ చేయి పట్టుకున్నోళ్లంతా పాతాళంలోకే అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇది ఆస్తుల వివాదం కాదని.. ఇది రాజకీయ ఆత్మహత్యే అని.. చివరికి జగన్ తన సొంత తల్లిని, చెల్లిని కూడా మోసం చేశారంటూ మండిపడ్డారు. వాళ్ల కుటుంబ తగాదాలు వాళ్లే రోడ్డుకీడ్చుకుని ఆ బురద మీడియాపైకి నెట్టడం హాస్యాస్పదమన్నారు. షర్మిలకిచ్చిన రూ.200 కోట్లు జగన్‌కు ఎక్కడివని ప్రశ్నించారు. 10 ఏళ్లలో రూ. 200 కోట్లు ఇచ్చానని జగన్ పేర్కొన్నా ఇప్పటికీ ఐటీ, ఈడీ ఎందుకు స్పందించడంలేదని అడిగారు.