వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారు ఒక్కరు కూడా ఆ పార్టీలో లేరని, జగన్‌ను నమ్ముకుని ఉన్న వాళ్ళ రోడ్డు పడ్డారని.. అందుకు తానే ఉదాహరణ అని ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ అన్నారు. జగన్ మాటల్లో గుడ్ అనే పదం లేదని, మద్యపానం నిషేధం అమలు చేయలేదని.. పోలవరం కట్టలేదని.. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలోనే వ్యతిరేకత వచ్చిందా..జగన్ అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం పాలన అద్భుతంగా ఉందని.. బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్‌ది ప్లాస్టిక్ నవ్వు అని... అన్న జగన్‌పై వైఎస్ షర్మిల చెప్పినవన్నీ నిజాలే అన్నారు. జగన్ చెప్పినట్లే ఎంపీ విజయసాయి రెడ్డి, ఎస్‌వి సుబ్బ రెడ్డి మాట్లాడుతున్నారని, వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎంతోమంది... వైసీపీని వీడడానికి రెడీగా ఉన్నారని, ముఖ్యమంత్రి చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గేట్లు ఎత్తేస్తే.. వైసీపీలో జగన్ తప్ప అందరూ వచ్చేస్తారని అన్నారు. ఏయూ మాజీ విసీ ప్రసాద్ రెడ్డి ఒక దుర్మార్గుడని.. ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారేు. ప్రసాద్ రెడ్డి విషయంలో చట్టం తన పని చేసుకుంటుందని జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ అన్నారు.