శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రపంచ ప్రఖ్యాత డేటా సేవల సంస్థ ఈక్వెనెక్స్ డేటా సెంటర్ కేంద్ర కార్యాలయాన్ని లోకేశ్ సందర్శించారు. తమ సంస్థ అందిస్తున్న డేటా సేవలు, కార్యకలాపాలను సంస్థ గ్లోబల్ ఎండీ కౌషిక్ జోషి, సీనియర్ స్ట్రాటజిక్ సేల్స్ ఇంజనీర్ రాబర్ట్ ఎలెన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆహ్వానించారు.
సమావేశంలో ఇండియాస్పోరా ఫౌండర్ ఎం.ఆర్. రంగస్వామి, ఫాల్కన్ ఎక్స్ కోఫౌండర్ రాజు ఇందుకూరి, గూగుల్ వైస్ ప్రెసిడెంట్ రావు సూరపనేని, ఏ5 కార్పొరేషన్ సీఈవో వినయ్ కృతివెంటి, అప్లైడ్ మెటీరియల్స్ సీటీవో ఓం నలమాసు, డేటా సెంటర్ సీఈవో కల్యాణ్ ముప్పనేని, గ్లోబల్ ఇండస్ట్రీ అనలిస్ట్ సీఈవో రాంరెడ్డి, సిలికానాంధ్ర ప్రెసిడెంట్ ఆనంద్ కూచిభొట్ల తదితర 20 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.