వైసీపీ హాయంలో ఎక్సైజ్ శాఖలో కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందని, జగన్మోహన్ రెడ్డి ఎక్సైజ్ డిపార్టుమెంట్‌నే లేపేసారని, ఆ డిపార్ట్‌మెంట్ లేకుండా చేసిన వ్యక్తి జగన్ అని జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. మద్యంలో వైసీపీ నేతలు అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు.
పూర్తి స్థాయిలో విచారణ చేస్తే... మిథున్ రెడ్డి అండ్ కో బాగోతాలు బయట పడతాయన్నారు. లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి, కసిరెడ్డి పాత్ర ఉందన్నారు. మద్యం షాపులో కూడా వైసీపీ నేతలు భారీగా దోచుకున్నారని, ఔట్ సౌర్స్ విభాగం ఏర్పాటు చేసి కొట్ల రూపాయలు కొల్లగట్టారని ధ్వజమెత్తారు. రాజ్ కసిరెడ్డి అనే బినామీని విచారణ చేస్తే కొన్ని కోట్ల రూపాయల సొమ్ము బయట పడుతుందన్నారు. ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై మంత్రి కొల్లు రవీంద్రకు ఫిర్యాదు చేస్తానన్నారు.