ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2024, 08:40 PM

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద లారీని కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వేగంగా ప్రయాణిస్తున్న కారు లారీ కిందికి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు నుజ్జునుజ్జు అయింది. మృతులు అనంతపురం ఇస్కాన్ ప్రార్థన మందిరం భక్తులుగా గుర్తించారు. వారు తాడిపత్రి నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా, ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగి ఆరుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com