అవనిగడ్డ ఎమ్మెల్యే, నవ్యాంధ్ర తొలి ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. ఆదివారం వైఎస్ఆర్ కడప జిల్లా కడప పర్యటనలో ఉన్న బుద్ధప్రసాద్ అమీన్ పీర్ దర్గాను దర్శించుకుని చాదర్ సమర్పించారు. దర్గా పెద్దలు ఆయనకు స్వాగతం పలికి సత్కరించారు. అమీన్ పీర్ దర్గాలో ప్రధాన మదార్ ను దర్శించుకుని చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.