ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీ సామాజిక న్యాయం ప్రజలకి తెలిసిపోయింది జగన్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2024, 07:02 PM

కుప్పంలో చంద్రబాబు గెలిస్తే ఆయన బూట్ పాలిష్ చేస్తూ, కాళ్ళ దగ్గిరే పడి ఉంటానన్న పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కున్నాడని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ‘వస్తే రాజ్యం... పొతే సైన్యం’ అన్నట్లుగా జగన్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు. సామాజిక న్యాయమంటే ఇదేనా జగన్ రెడ్డి? అని ప్రశ్నించారు. ఒక పక్క ‘నా ఎస్సీలు.. నా బీసీలు’ అంటూ దీర్గాలు తీస్తున్నారని.. మరో పక్క రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి, లోక్‌సభలో నాయకుడిగా మిధున్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైవీ సుబ్బారెడ్డి, అసెంబ్లీ నేతగా జగన్ రెడ్డిలను నియమించుకోవటంలో మీకు మీరే సాటి అని ఎద్దేవా చేశారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే ఆయన బూట్ పాలిష్ చేస్తూ, కాళ్ళ దగ్గిరే పడి ఉంటానన్న పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కున్నాడని కనపర్తి శ్రీనివాసరావు ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com