చిన్నమండెం మండల పరిధిలోని గుట్టు సమీపంలో మొటుకు అడవిలో మహిళను ఉరి తీసి చంపిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. తీవ్ర కలకలం రేపిన ఘటనకు సంబంధించి వివరాల మేరకు తుమ్మలగుంది సమీపంలోని మొటుకు అడవిలోగుర్తుతెలియని యువతని అడవిలోనికి తీసుకెళ్లి ఉరితీసి ఆత్మహత్య లాగా చిత్రీకరించాలని చూశారని ఆరోపిస్తున్నారు. చిన్నమండెం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. మిగతా విషయాలు తెలియాల్సి ఉంది.