కొండాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహించారు. డాక్టర్ సాంబశివారెడ్డి మాట్లాడుతూ. అధిక రక్తపోటును తక్కువ అంచనా వేయకూడదని నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణానికే ప్రమాదం అన్నారు. వ్యాయామం, ఆహారంలో ఉప్పు, కారం, తగ్గించడం మద్యపానం, ధూమపానం, ఆపివేయడం తో హైబీపీని నియంత్రించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో లీలావతి, మధు, నాగరాణి విజయ మేరీ, శివశంకర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.