ప్రకాశం జిల్లా మార్కాపురం ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఉపాధి హామీ పథకం సిబ్బందికి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డ్వామా పిడి అర్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫారం పాండ్, ప్లాంటేషన్ తో పాటు కొత్త పనులను కల్పించాలని సూచించారు. ఎస్సీ ఎస్టీలకు పనులు కల్పించేలా చర్యలు చేపట్టాలని సిబ్బందికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చందన పాల్గొన్నారు.