ఉరవకొండ మండలం నింబగల్లు వద్ద మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని టాటా మ్యాజిక్ వాహనం ఢీ కొన్న ఘటనలో బెలుగుప్ప, విడపనకల్లు వైకెపి ఏపీఎంలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడి స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు.