ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్‌ కి నివాళులు అర్పించిన సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 12:39 PM

బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్‌ చేసిన సేవలు నిరుపమానమని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొనియాడారు. నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి.. నివాళులు అర్పించారు.  ‘భారత రాజ్యాంగ ప్రదాత, దేశ పాలనా మార్గదర్శకాల విధాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి నేడు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు నిరుపమానం. ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ మన ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి అహర్నిశలూ కృషి చేస్తోంది. బాబా సాహెబ్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు’ అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com