ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పురందేశ్వరి, చంద్రబాబుని హరిచంద్రుడు అనడం హాస్యాస్పదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2023, 02:15 PM

బీజేపీ నేత పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిలా కాకుండా టీడీపీ అధ్యక్షురాలిలా వ్యవహరిస్తోందని, ఆరోజు  డబ్బు కోసం, పదవి కోసం ఆశపడి పురందేశ్వరి ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచిందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే చంద్రబాబు అవినీతిపరుడని చెబుతుంటే.. పురందేశ్వరి మాత్రం ఆయనేదో సత్యహరిశ్చంద్రుడన్నట్టు మద్దతిస్తున్నారన్నారు. మద్యం షాపుల్లో నగదు, ఆన్‌లైన్ పేమెంట్లు రెండూ తీసుకుంటున్నారని.. పురందేశ్వరి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడవద్దని హెచ్చరిస్తూనే ఆమె ఏమైనా ఆడిటరా..? అని చురకలంటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com