హైదరాబాద్: ప్రముఖ నటి భావన మలయాళ నిర్మాత నవీన్‌తో గురువారం నిశ్చితార్థం చేసుకున్నారు. కొందరు అతిథుల మధ్య ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. మూవీ ఇండస్ట్రీ ట్రాకర్ రమేశ్ బాలా తన ట్విటర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ కాబోయే దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. ఇంకా పెళ్లి తేదీని నిర్ణయించలేదని ట్వీట్ చేశారు. భావన, నవీన్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని భావన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాము 2014లోనే వివాహం చేసుకోవాలనుకున్నామని, కానీ వృత్తిపరంగా ఉన్న నిబద్ధతల వల్ల కుదరలేదని అప్పట్లో ఆమె అన్నారు.
‘మహాత్మ’, ‘ఒంటరి’, ‘నిప్పు’ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన భావన అనేక మలయాళ చిత్రాల్లో నటించారు.