ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగం చేస్తే టీసీఎస్‌లోనే చెయ్యాలి! ప్రపంచ ఉత్తమ యాజమాన్య సంస్థలపై టాప్‌ ఎంప్లాయర్‌ నివేదిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2017, 08:53 AM

ముంబయి: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచంలోనే ఉత్తమ యాజమాన్య సంస్థల జాబితాలో ఒకటిగా నిలిచింది. వరుసగా రెండో ఏడాదీ సంస్థ ఈ ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. ఐరోపా, ఆసియా పసిఫిక్‌, ఉత్తర అమెరికా, లాటిన్‌ అమెరికా, మధ్యప్రాచ్యం వంటి విపణుల్లో సంస్థ ఉద్యోగులకు అందిస్తున్న ఉత్తమ సేవలకుగాను ఈ గుర్తింపు దక్కింది. ఈమేరకు అంతర్జాతీయ సంస్థ టాప్‌ ఎంప్లాయర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈ వివరాలను వెల్లడించింది. ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణాన్ని కల్పించడమేగాక.. వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు టీసీఎస్‌ ప్రోత్సహిస్తోందని టాప్‌ ఎంప్లాయర్‌ కితాబిచ్చింది. తమ ఉద్యోగులకు సమాన అవకాశాలు కల్పించడంతోపాటు, ప్రస్తుత డిజిటల్‌ సాంకేతికతకు అనుగుణంగా వారి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు తగిన పెట్టుబడులు పెడుతున్నామని టీసీఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షుడు, అంతర్జాతీయ మానవ వనరుల అధిపతి అజయ్‌ ముఖర్జీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 116 దేశాల్లో 1,200 కంపెనీలను సర్వే చేసి టాప్‌ ఎంప్లాయర్‌ ఈ జాబితాను రూపొందించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com