బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే కేసీఆర్ నడుస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన లోకేష్ తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం గడువు కంటే ముందు రద్దైపోవడం బాధకలిగించదని ఆయన అన్నారు. అక్రమ సంబంధానికి కులగోత్రాలతో పనేముందనివ్యాఖ్యానించిన ఆయన ప్రీపోల్ అలయెన్స్ పెట్టుకున్న తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం సహకారం అందించని కేంద్రం…తెలంగాణ రాష్ట్రానికి మాత్రం అన్ని విధాలుగా సహకారం అందించిందన్నారు. జోనల్ వ్యవస్థకు మూడు రోజులలో గెజిట్ ఇచ్చారని లోకేష్ అన్నారు.