అక్కినేని నాగచైతన్య ఎప్పుడూ చాలా లో ప్రొఫైల్ మెయిన్టైన్ చేస్తాడు. అవసరమైతే తప్ప మీడియా ముందుకు రాడు. అయితే స్టార్ హీరోయిన్ సమంతతో ప్రేమ వ్యవహారంతో ఒక్కసారిగా మీడియాకు హాట్‌టాపిక్ అయిపోయాడు. చైతన్యకు సంబంధించి ఎవరికీ తెలియని విశేషాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటోంది సమంత.తాజాగా చైతూకు సంబంధించిన ఓ కొత్త విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా తెలియజేసింది. చైతూ గ్యాస్ స్టౌవ్ దగ్గర నిల్చుని తన కోసం బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తున్న ఫోటోను అభిమానులతో పంచుకుంది. ‘తను నాకోసం బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసిన తర్వాతే బయటకు వెళ్తాడు. ఈ ప్రపంచానికి నేనే మహారాణి అనుకునేలా చేసిన దేవుడికి మోకాళ్లపై కూర్చుని అభివాదం చేస్తున్నాన’ని సమంత పోస్ట్ చేసింది.