ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్‌ పార్టీకి దశాదిశ లేదు: కళా వెంకట్రావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 03, 2018, 03:23 PM

శ్రీకాకుళం: పవన్‌ కల్యాణ్‌ పార్టీకి దశాదిశ లేదని కళా వెంకట్రావు అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు చేశారు. పవన్‌ పర్యటనంతా టీడీపీపై విమర్శలే తప్ప వేరే అంశాలు లేవన్నారు. ఉద్దానం, శ్రీకాకుళంలో ఎన్ని డయాలసిస్‌ కేంద్రాలు ఉన్నాయో పవన్‌కు తెలుసా? అని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌ జగన్‌ను, బీజేపీని విమర్శించడం లేదని పేర్కొన్నారు. జగన్‌ బీజేపీను ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు ఓ డ్రామా అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com