ముంబై : సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ మహారాష్ట్ర అడిషనల్ డీజీపీ లక్ష్మీనారాయణ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తన రాజీనామాను మహారాష్ట్ర డీజీపీకి సమర్పించారు. అయితే ఈ విషయాన్ని ఆయన కానీ మహారాష్ట్ర డీజీపీ కానీ అధికారికంగా ధృవీకరించలేదు. గత కొంత కాలంగా ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలలోకి వస్తారన్న వార్తలు వినవస్తున్నాయి.