బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావులను సీఎం అభినందించారు. అసెంబ్లిలోని సీఎం ఛాంబర్లో రాజీనామా లేఖలను ఇచ్చేందుకు వచ్చిన మంత్రులు కామినేని, మాణిక్యాలరావులను మంత్రివర్గంలో చేసినంత కాలం బాగా పని చేశారని చంద్రబాబు అభినందించారు. తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు వారితో అన్నారు. శాసనసభలో చంద్రబాబు మాట్లాడుతూ మంత్రులుగా వారి పని తీరుపై తనకు ఎలాంటి ఆక్షేపణ లేదన్నారు. వైద్యశాఖలో కామినేని ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. దేవాదాయ శాఖమంత్రిగా మాణిక్యాలరావు రెండు పుష్కరాలను సమర్థంగా నిర్వహించారన్నారు.