బెంగళూరు: కన్నడ బిగ్బాస్ హౌజ్లో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. బెంగళూరు నగర శివారు బిదాడిలోని ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీలో నిర్మించిన కన్నడ బిగ్బాస్ హౌస్ సగానికి పైగా కాలిపోయింది. షాట్సర్య్కూట్ వల్లే ప్రమాదం సంభవించి ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. రామ్నగర్, చెన్నపట్నం, బెంగళూరు నుంచి ఫైరింజన్స్ ను రప్పించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కన్నడ బిగ్బాస్ సీజన్-5 టింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రమాదం జరిగిన సమయంలో సెట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ సెట్ లో అత్యంత ఖరీదైన ఫర్నిచర్ కాలిపోవటంతో ఆస్తి నష్టం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.