ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ పెన్షనర్ల 40వ వార్షికోత్సవ వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2017, 12:51 AM

 -ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపునకు అందరు కృషి చేయాలి
 -పట్టభద్రులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
 -ఆత్మీయ సభలో రాష్ట్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు
  విజయవాడ, సూర్య బ్యూరో : రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. రాష్ర్ట ప్రభుత్వ పెన్షనర్ల సంఘం 40వ వార్షికోత్సవ వేడుకలు సందర్బంగా సోమవారం నగరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ర్ట ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలు పరిష్కరించి వారిని అన్నివిధాలా ఆదుకుంటా మని ముఖ్యమంత్రి అన్నారు. పెన్షనర్లు అభివద్ధి కార్యక్రమాలలో భాగస్వా ములు కావాలని పిలుపునిచ్చారు. పెన్షనర్లనుకు అండగావుండి వారి సమస్య లను పరిష్కరిస్తానన్నారు. 40 సంవత్సరాలు పాటు పెన్షనర్ల సంఘాన్ని సమర్థ వంతంగా నడిపించిన వారికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఎక్కువ అనుభవం వున్న వ్యక్తులు పెన్షన్‌దారులేనని అన్ని సమస్యలు నాయకత్వంపట్ల అవగాహన వుంటుందన్నారు. రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షను దారులకు ఫిట్‌మెంట్‌ తీసుకువచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. విభజన హేతుబద్ధంగా లేదని ఎవ్వరికీ అన్యాయం జరగకుండా కోరినప్పటికీ విభజన చేసిన తీరు దురదష్టకరమన్నారు. అప్పులను జనాభాపరంగాను, ఆస్తులను ప్రాంతాలవారీగా విభజించారన్నారు. నూతనరాజధాని నిర్మాణానికి రైతులు ముందుకువచ్చి 33వేల ఎకరాలు నమ్మకంతో ఇచ్చారన్నారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తిచేసేందుకు అడ్డంకిగావున్న ఏడు మండలాలను మనరాష్ర్టంలో విలీనంచేసేలా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడిచేశానని గుర్తుచేశారు. నదుల అనుసంధానంతో రాష్ర్టభవిష్యత్తు బాగుంటుందన్నారు. 1974 కిలోమీటర్లు తీరప్రాంతం వుండటం మన అదష్టమని అపారమైన వనరులు మనకు వున్నాయన్నారు. పెన్షనర్లు తమకు నచ్చిన పనిచేయటం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చన్నారు. 70 సంవత్సరాలకు అదనపు పింఛను మంజూరుచేయాలని పెన్షనర్ల సంఘం విజ్ఞాపనలను పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ర్టవ్యాప్తంగా పెన్షనర్ల సంఘం కార్యాలయాలు లేనిచోట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 2,41,690 సభ్యులు కలిగిన రాష్ర్టప్రభుత్వ పెన్షనర్ల సంఘం సమాజసేవకు పాటుపడాలని పదిమందిలో చైతన్యం తీసుకురావాలని, వారి అనుభవాలు పంచుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రభుత్వ ఆదాయం పెరిగితే వెసులు బాటు వస్తుందని, అందరి సహకారంతో ఆదర్శరాష్ర్టంగా తీర్చిదిద్దుదామని, తద్వారా జీవనప్రమాణం పెరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. పెన్షను దారులు సమాజ అభివద్ధికి పాటుపడాలని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ముఖ్యమంత్రి పెన్షనర్లకు విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో సభకు అధ్యక్షత మహించిన రాష్ర్ట ప్రభుత్వ పెన్షనర్ల సంఘం అధ్యక్షులు కొనకంచి సోమేశ్వర ƒరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్‌ పింఛను దారులకు వర్తింపచేయటంపట్ల ముఖ్యమంత్రికి కతజ్ఞతలు తెలియ చేశారు. పెన్షనుదారులకు ప్రస్తుతం ఇస్తున్న అదనపు పింఛనును 70 సంవత్స రాలకు వర్తింపచేయాలని, రాష్ర్ట ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ర్ట కార్యాలయ ఏర్పాటుకు ఐదు సెంట్ల స్థలాన్ని మంజూరుచేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి  కె.ఇ.కష్ణమూర్తి, జెఎసి చైర్మన్‌ పి.అశోక్‌బాబు, జనరల్‌ సెక్రటరీ ఐ.వెంకటేశ్వరరావు, డిప్యూటీ సెక్రటరీ ఎన్‌.చంద్రశేఖరరెడ్డి, జెఎసి వెస్‌‌ట కష్ణా చైర్మన్‌ ఎ.విద్యాసాగర్‌, రాష్ర్ట సంఘం సెక్రటరీ జనరల్‌ డి.వెంకటేశ్వర్లు, రాష్ర్ట సంఘం సలహాదారులు కె. దాలి నాయుడు, పెద్దింటి అప్పారావు, డిడి ప్రసాదరావు, రాష్ర్టంలోని 13 జిల్లాల నుండి ప్రభుత్వ పెన్షనర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com