ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాల్‌ప్రాక్టీస్‌ చేస్తే నాలుగేళ్లు డిబారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2017, 12:47 AM

-ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల మార్చి నాటి పరీక్ష 19న
-ఆన్‌లైన్‌ ద్వారా హాల్‌ టిక్కెట్లు పొందవచ్చు
-విధుల్లో పూర్తి స్థాయి అప్రమత్తత తప్పనిసరి
-ఇంటర్మీడియట్‌ బోర్డు కమిషనర్‌ బి. ఉదయలక్ష్మి

 విజయవాడ, మేజర్‌న్యూస్‌ : మార్చి 1 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలో మాల్‌ ప్రాక్టీస్‌ చేస్తే  4 ఏళ్ల వరకూ డిబారు చేయడం జరుగుతుందని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి బి. ఉదయలక్ష్మి విద్యార్థులను తెలిపారు.  ఇంటర్‌ పరీక్షలపై సోమవారం విజయవాడలోని కమాండ్‌ కమ్యునికేషన్‌ సెంటర్‌ నుండి ఆమె సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందరేంగా మార్చి 9వ తారీఖున నిర్వహించాల్సి ఉన్న  రెండవ సంవత్సరం మ్యాథ్‌‌స -2బి పేపర్‌, జువాలజీ, హిస్టరీ, రెండవ సంవత్సరం ఒకేషనల్‌ పరీక్షలను 19-03-2017 (ఆదివారం) నిర్వహిస్తామని, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.  పరీక్షా కేంద్రంలోకి ప్రతి ఒక్క విద్యార్థి ఉదయం 8.30ల లోగా వారికి నిర్దేశించిన  పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. వెబ్‌ సైట్‌ ద్వారా  డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ఇందు కోసం ఇంటర్‌ మొదటి సంవత్సర విద్యా ర్థులు పదవ తరగతి హాల్‌ టిక్కెట్‌ నంబరును, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఇంటర్‌ మొదటి సంవత్సరం హాల్‌ టిక్కెట్‌ నంబర్‌ను లేదా ప్రాక్టికల్‌ ద్వితీయ సంవత్సరం హాల్‌ టిక్కెట్‌ నంబర్‌ను వెబ్‌ సైట్‌లో పొందుపర్చుకుని హాల్‌ టిక్కెట్లు పొందాలని ఆమె సూచించారు. మరిన్ని వివరాల కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 18002749868 / కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 08662974130 లతో సంప్రదించవచ్చునన్నారు. పరీక్ష పరిసర కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని ఉదయలక్ష్మి పేర్కొన్నారు. మాస్‌ కాపీయింగ్‌ ను, కాపీయింగ్‌ ను అరికట్టేందుకు ఆయా పరీక్షా కేంద్రాల ముఖ్య ఎగ్జామినర్లు తనిఖీలు చేపట్టా లన్నారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్‌‌స మెషిన్ల షాపులు తెరవరాదని దుకాణదారులకు సూచించారు. విద్యార్థులకు ఎటువంటి ఎలక్ట్రా నిక్‌ గాడ్జెట్‌‌స, సెల్‌ ఫోన్లకు అనుమతి లేదని ..ఇన్విజిలేషన్‌ చేయడానికి వచ్చే లెక్చరర్లు కూడా సెల్‌ఫోన్లను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురాకూడదని ఆమె ఆదేశించారు. బుధవారం నుంచి నిర్వహించే ఇంటర్‌ మీడియట్‌ పరీక్షల కోసం, మొత్తం  1445 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 5,23,099 మంది హాజరవుతున్నారని, వీరిలో బాలురు 2, 63, 081 మంది, బాలికలు  2, 60, 018 మంది ఉన్నారన్నారు. అదే విధంగా ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు   5, 08, 186 మంది హాజరవుతుండగా  వారిలో బాలురు 2, 58, 566 మంది, బాలికలు - 2, 49, 620 మంది ఉన్నారన్నారు.  మొత్తం 35 సమస్యాత్మక పరీక్షా కేంద్రాల గుర్తిం చామని ఆయా కేంద్రాలలో పటిష్ట భద్రత కోసం, సమర్ధవంతంగా పరీక్షల్ని నిర్వహించడం కోసం అన్ని తరగతి గదుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.
    పరీక్షా కేంద్రాల తనిఖీలలో, విధుల నిర్వహణలో ఎటువంటి అలక్ష్యాన్ని సహించమని మార్గదర్శకాలను తప్పని సరిగా పాటించాలన్నారు.పరీక్ష నిర్వహణ కోసం   సంబంధిత  అధ్యాపకులు ఆ రోజు ఎగ్జామినర్‌ డ్యూటీలో కాకుండా ఇతర్త్ర విధులలో భాగస్వాములను చేయనున్నామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్‌‌సలో  విద్యాశాఖ జాయింట్‌ సెక్రటరీ రమేష్‌, ఆఐవోలు, ఆర్జేడీలు, ఎగ్జామినర్లు, సభ్యులు, 13 జిల్లాల అధికారులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com